ఇక భైంసా అల్లర్లకు చెక్ : నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి

by Aamani |   ( Updated:2021-07-15 23:07:53.0  )
North Zone IG Nagireddy
X

దిశ, ముధోల్: రాబోయే పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి సూచించారు. గురువారం ఐజీ నాగిరెడ్డి భైంసా పట్టణంలోని పలు చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం గడ్డన్న వాగు ప్రాజెక్టు సమీపంలో మీర్జాపూర్ వద్ద ప్రత్యేక పోలీసు(టీఎస్ఎస్సీ) బెటాలియన్ సబ్ హెడ్ క్వార్టర్ పటాలం ఏర్పాటుకు కేటాయించిన పదెకరాల స్థలాన్ని జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ నాగిరెడ్డి మాట్లాడుతూ… నేరాలు, నేరస్తుల సత్వర గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని, దుకాణదారులు, గృహస్తులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే పోలీసుశాఖ ఆధ్వర్యంలో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

భైంసాలో తరచుగా మతఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకోవడంతో శాంతిభద్రతల సమస్య నెలకొనడంతో అదనపు బలగాల కోసం పక్క జిల్లాల నుంచి రప్పించాల్సి వచ్చేదని అన్నారు. గతేడాది కాలంలోనే రెండు, మూడుసార్లు అల్లర్లు చోటు చేసుకోవడంతో భైంసాలో శాశ్వతంగా శాంతిభద్రతలు నెలకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేకంగా బెటాలియన్ దాదాపు 220 మంది బలగాలతో బెటాలియన్ సబ్ హెడ్క్వార్టర్ ఏర్పాటు కానునందన్నారు. తద్వారా భైంసాలో ఇకపై ఎలాంటి అల్లర్ల, ఘటనలు జరిగినా క్షణాల్లో పోలీసు బలగాలు చేరుకుని, అల్లర్లను అదుపులోకి తెచ్చే విధంగా పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నారు. ఐజీ వెంట ఎస్పీ కిరణ్ కారే ప్రభాకర్, సీఐలు ప్రవీణ్ కుమార్, చంద్రశేఖర్, అజయ్ బాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed