నో చెప్పినా.. ఏడుసార్లు వచ్చాడు : భాగ్యశ్రీ

by Shamantha N |   ( Updated:2021-01-05 06:50:11.0  )
నో చెప్పినా.. ఏడుసార్లు వచ్చాడు : భాగ్యశ్రీ
X

దిశ, వెబ్‌డెస్క్ : జోడీ అంటే ‘మైనే ప్యార్ కియా’ సినిమాలో సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీలా ఉండాలని చెప్తుంటారు. లవ్ స్టోరీస్‌కు కొత్త ఫ్లేవర్‌ను పరిచయం చేసిన ఈ సినిమాలో సల్మాన్, భాగ్యశ్రీ ప్లేస్‌లో మరొకరిని ఊహించుకునేందుకు కూడా ఆడియన్స్ ఇష్టపడరు. అంటే ప్రేమికులుగా వారిద్దరూ అంత గొప్పగా జీవించారు. 1989లో రిలీజైన ఈ చిత్రం ద్వారా హిందీ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇచ్చి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న భాగ్యశ్రీ.. ఈ సినిమాలో నటించేందుకు ముందుగా నో చెప్పారట.

తను విదేశాలకు వెళ్లి స్టడీస్ కంప్లీట్ చేయాలని పట్టుబట్టగా.. తండ్రి మాత్రం ఇండియాలోనే చదువు పూర్తి చేయాలని సూచించారట. ఇంట్లో ఈ చర్చ జరుగుతున్న క్రమంలోనే డైరెక్టర్ తన దగ్గరకు ‘మైనే ప్యార్ కియా’ స్క్రిప్ట్‌తో వచ్చారని వెల్లడించింది. తను స్టోరీ నెరేట్ చేసిన విధానం ఇంప్రెస్ చేసినా.. విదేశాల్లో చదువుకోవాలనే డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలనుకున్న తను ఇందుకు నో చెప్పానని తెలిపింది. దాదాపు ఏడుసార్లు డైరెక్టర్ స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దుతూ తనను అప్రోచ్ అయినా.. ప్రతీసారి ఏదో ఒక వంక చెప్పేదాన్నని, మొత్తానికి ఏడోసారి ఒప్పుకున్నానని తెలిపింది. ఆ సినిమా లేకపోతే ‘భాగ్యశ్రీ అనే నేను’ లోకానికి తెలియకుండేదని చెప్పింది. కాగా భాగ్యశ్రీ ప్రజెంట్ రెబల్ స్టార్ ప్రభాన్ ‘రాధే శ్యామ్’ మూవీలో కీ రోల్ ప్లే చేస్తోంది.

Advertisement

Next Story