ఘనంగా భద్రాద్రి సీతారాముల కల్యాణం

by Shyam |   ( Updated:2021-04-21 08:04:55.0  )
ఘనంగా భద్రాద్రి సీతారాముల కల్యాణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగే భద్రాద్రి సీతారాముల కల్యాణం ఈసారి కరోనా నేపథ్యంలో ప్రముఖులు, ఆలయ ఉద్యోగుల సమక్షంలో జరిగింది. కరోనా నిబంధనల దృష్ట్యా సాధారణ భక్తులను అనుమతించలేదు. కల్యాణ వేడుక సందర్భంగా ఆలయం మొత్తాన్ని పూలతో, మామిడాకులతో, అరటాకులతో అలంకరించారు. ఆలయంలోని నిత్యకల్యాణ మండపాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

అభిజిత్ ల‌గ్నంలో సీతారాముల క‌ల్యాణ వేడుక క‌మ‌నీయంగా సాగింది. స‌రిగ్గా ప‌న్నెండు గంట‌ల‌కు జిల‌క‌ర్ర‌, బెల్లం పెట్టారు. అనంత‌రం మాంగ‌ళ్య‌ధార‌ణ జ‌రిగింది. ఈ తంతును భక్తులంగా టీవీలో వీక్షించారు. ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తలంబ్రాలను అందించారు.

Advertisement

Next Story

Most Viewed