#BetheREALMAN.. అమ్మకు పెసరట్టు వేసిన చిరు

by Jakkula Samataha |   ( Updated:2020-04-23 00:24:20.0  )
#BetheREALMAN.. అమ్మకు పెసరట్టు వేసిన చిరు
X

మెగాస్టార్ చిరంజీవి … సూపర్ స్టైల్… సూపర్ గ్రేస్.. సూపర్ టైమింగ్. ఎంత మంది హీరోలు వచ్చినా.. ఆయనను మరిపించలేరు… అంతగా ప్రేక్షకులను మురిపించలేరు. ఇది సినిమా విషయంలోనే అనుకున్నాం ఇంత వరకు… కానీ ఇప్పుడు అర్ధం అయింది… నిజానికి ఆయన ఏది చేసినా ఆ స్టైలే వేరప్పా అని. ఏదైనా అంటే ఏమిటి అనేగా … ఇంటి పని, వంట పని చేసినా… అందులోనూ ఓ స్టైల్ ఉంది.

టాలీవుడ్ ను ఊపేస్తున్న #betheREALMAN చాలెంజ్ లో భాగంగా తారక్ చిరును నామినేట్ చేయగా… ఇట్స్ మై చాలెంజ్ అంటూ టాస్క్ స్వీకరించాడు చిరు. భీమ్ నేను రోజూ చేసే పనులే… మీ కోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా ఇంటిని తన స్టైల్ లో శుభ్రం చేసిన చిరు… తర్వాత పెసరట్టు ఉప్మా వేశాడు. పెసరట్టు వేయడంలో ఆ స్టైల్ ఉంది చూశారు… వావ్… అమేజింగ్ అంతే. చాలెంజ్ వీడియోలో ఇక్కడి వరకు ఒక ఎత్తు అయితే… వేసిన పెసరట్టు ఉప్మా అమ్మ అంజనాదేవికి తీసుకెళ్ళి పెట్టడం నెటిజన్లను ఎమోషనల్ గా కనెక్ట్ చేసింది. ఆ తల్లి తను తినకుండా… తనయుడికి ముందుగా తినిపించడం… అమ్మకు కొడుకు ఎప్పుడూ పసివాడే అనిపించేలా… చూసేవారికి ఆనందంతో కన్నీరు తెప్పించేలా ఉంది. అమ్మ కనిపించగానే “మగువా మగువా ఈ లోకానికి తెలుసా నీ విలువ” అంటూ… సాంగ్ ప్లే కావడం… అది కూడా పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” పాట కావడం ది బెస్ట్ అనిపిస్తుంది. ఇక ఈ వీడియోలో మరో స్పెషల్ చిరు, చెర్రీలా ఫోటో… మొత్తానికి మెగా ఫ్యాన్స్ కి వీర లెవల్ లో కిక్ ఇచ్చింది #betheREALMAN చాలెంజ్.

సూపర్ వెరైటీ గా … సూపర్ స్టైలిష్ గా … టాస్క్ కంప్లీట్ చేసిన చిరు… #betheREALMAN చాలెంజ్ కు మంత్రి కేటీఆర్, చిరు స్నేహితుడు సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మణిరత్నంను నామినేట్ చేశారు.

Tags : Chiranjeevi, Megastar, betheREALMAN, KTR, Maniratnam, Rajinikanth, NTR

Advertisement

Next Story