- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎట్టకేలకు బెంగళూరు విజయం
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21లో భాగంగా మంగళవారం తిలక్ మైదాన్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు క్లబ్ 2-1తో విజయం సాధించింది. గత కొన్ని మ్యాచ్‌లుగా విజయాలకు దూరమైన బెంగళూరు ఎట్టకేలకు విజయంతో ఊరట చెందింది. టాస్ గెలిచిన ఈస్ట్ బెంగాల్ జట్టు కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. బెంగళూరు ఆటగాళ్లు దూకుడుగా ఆడుతుండటంతో 11వ నిమిషంలోనే గోల్ సాధించింది. కెప్టెన్ సునిల్ చత్రీ ఇచ్చిన పాస్‌ను క్లీటన్ సిల్వ గోల్‌గా మార్చాడు. దీంతో బెంగళూరు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈస్ట్ బెంగాల్ జట్టుకు బంతి దొరకడమే గగనమైపోయింది. బంతి ఎక్కువ సమయం బెంగళూరు ఆటగాళ్ల నియంత్రణలోనే ఉండటంతో ఈస్ట్ బెంగాల్ ఆటగాళ్లు అసహనంతో ఓన్ గోల్ చేసుకున్నారు. తొలి అర్థభాగం ముగుస్తుందనగా బెంగాల్ ఆటగాడు దేబ్‌జిత్ మజుందార్ స్వంత గోల్ పోస్టులోకి బంతిని తరలించాడు. దీంతో బెంగళూరు జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో అర్దభాగంలో హోరా హోరీగా తలపడినా ఇరు జట్లు ఒక్కగోల్ కూడా చేయలేకపోయారు. దీంతో బెంగళూరు జట్టు 2-0 ఆధిక్యంతో ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్‌పై విజయం సాధించింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు రాహుల్ భేకేకు, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సునిల్ ఛత్రికి లభించింది.