- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా టీచర్ ను కట్టేసి..కొడుతూ రోడ్డుపై లాక్కెళ్లారు
బెంగాల్ లో అధికార పార్టీ నేత దురహంకారం
పశ్చిమబెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన కొందరు గ్రామస్థాయి నాయకులు తమ అధికార దురహంకారానికి పాల్పడ్డారు. రోడ్డు వెడల్పు పనుల్లో తమ భూమి కోల్పోతున్నామని నిరసన తెలిపిన ఓ మహిళా ఉపాధ్యాయురాలిని తాళ్లతో కట్టేసి, కొడుతూ.. నడిరోడ్డుపై లాక్కెళ్లారు. అడ్డొచ్చిన చెల్లెలిపైనా దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అమానవీయ ఘటన రాష్ట్రంలోని సౌత్ దినాజ్ పూర్ జిల్లా.. గంగారాంపూర్ స్టేషన్ పరిధిలోని ఫతా నగర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన టీఎంసీ నాయకుడు అమల్ సర్కార్ కాలనీల్లో రోడ్డు వెడల్పు పనులు చేపట్టాడు. ఈ పనుల వల్ల స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న బాధితురాలు స్మృతికోనా తమ భూమిని కోల్పోవాల్సి వచ్చినప్పటికీ, అంగీకరించింది. దీంతో పనులు చేపట్టగా, రోడ్డును అనుకున్న దానికంటే ఎక్కువ వెడల్పు చేయాలని నిర్ణయించడంతో.. బాధితురాలు ఎక్కువ భూమి కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై అమల్ ను ప్రశ్నించగా, ఆయన పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు పనులు జరగకుండా తన ఇంటిముందు బైటాయించింది. ఆగ్రహించిన అమల్ అనుచరులు.. స్మృతికోనా కాళ్లను తాళ్లతో కట్టేసి, కొడుతూ, మట్టి రోడ్డుపై లాక్కెళ్లారు. అడ్డుకోవడానికి వచ్చిన తన చెల్లెలిని సైతం లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నది. దీంతో టీఎంసీ జిల్లా చీఫ్ అమల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు.