బెంగాల్‌లో నిబంధనలు మరింత కఠినం

by Shamantha N |
బెంగాల్‌లో నిబంధనలు మరింత కఠినం
X

కోల్‌కతా: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బఫర్ జోన్లు, కంటైన్‌మెంట్ జోన్లను కలిపేయనుంది. ఈ కంటైన్‌మెంట్ జోన్లలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని రకాల రవాణా, మార్కెటింగ్, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రజలు గుమిగూడటం, అత్యవసరసేవలు మినహా అన్నీ నిలిపేయనుంది. ఈ నిబంధనలు గురువారం సాయంత్రం 5గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కోల్‌కతా సహా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలు కంటైన్‌మెంట్ జోన్లుగా మారనున్నట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed