- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షాకు స్పెషల్ కోర్టు షాక్..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ 2018లో వేసిన పరువు నష్టం కేసులో స్పెషల్ కోర్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న స్వయంగా అమిత్ షా లేదంటే ఆయన తరఫు న్యాయవాది కోర్టు ముందు హాజరవ్వాలని ఆదేశించింది. 2018 ఆగస్టులో అభిషేక్ బెనర్జీపై అమిత్ షా చేసిన ఆరోపణలకు సంబంధించినదే ఈ కేసు. 2018 ఆగస్టు 11న యువ స్వాభిమాన్ సమావేశ్ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ… ‘నారదా, శారదా, రోజ్ వ్యాలీ, సిండికేట్ అవినీతి, అల్లుడి (మమతా బెనర్జీ అల్లుడు!) అవినీతి, మమతా బెనర్జీ చేసిన అనేక అవినీతి పనులు’ అంటూ షా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను అభిషేక్ బెనర్జీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘బెంగాల్ గ్రామీణులకు డబ్బు అందిందా? గట్టిగా చెప్పండి. మరి ఎక్కడికి పోయింది? ఎక్కడికి? అవి మీ కోసం మోడీ పంపారు. రూ. 3,59,000 కోట్లు ఎక్కడికి పోయాయి? వీటిని అల్లుడు, సిండికేట్‌కు బహుమానం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అవినీతికి పాల్పడింది’ అంటూ ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా పేర్కొన్న మాటలను బెనర్జీ తన కంప్లైంట్‌లో పొందుపరిచారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు బెనర్జీ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై అమిత్ షాకు సమన్లు జారీ చేసింది.