ఇంధన ధరలపై బెంగాల్ సీఎం కీలక నిర్ణయం

by Shamantha N |
ఇంధన ధరలపై బెంగాల్ సీఎం కీలక నిర్ణయం
X

కోల్‌కతా: ఇంధన ధరలు ఆకాశన్ని అంటుతుండగా బెంగాల్ ప్రభుత్వం వినియోగదారులకు ఉపశమనమి వ్వడానికి చర్యలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ప్రతి లీటర్‌పై ఒక్క రూపాయి మేర పన్నును తగ్గిస్తున్న ట్టు ప్రకటించింది. ఈ ప్రకటన అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ఆదివారం బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు.

‘కేంద్ర ప్రభుత్వం ప్రతి లీటర్ పెట్రోల్‌పై రూ. 32.90 వసూలు చేయగా రాష్ట్రానికి రూ. 18.46 మాత్రమే వస్తున్నాయి. లీటర్ డీజిల్‌పై కేంద్రం రూ. 31.80 ఆర్జించగా, రాష్ట్రం రూ. 12.77 పొందుతున్నది’ అని వివరించారు. అంతేకాదు, రాష్ట్రాల వాటాకు గండిపెట్టేలా కేంద్ర ప్రభుత్వం సెస్‌ను విధించిందని ఆరోపిం చారు. ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్య అని విమర్శించారు.

Advertisement

Next Story