బిగ్ బ్రేకింగ్: ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘన విజయం

by Anukaran |
Bengal CM Mamata Banerjee
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌పై 58 వేల 389 ఓట్ల తేడాతో దీదీ గెలుపొందారు. కాగా, గతకొన్ని రోజులుగా ఈ ఉప ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఒకవేళ మమత బెనర్జీ ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉండేది. ఆ పరిస్థితి చోటు లేకుండా.. ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఘన విజయం సాధించింది.

Advertisement

Next Story