కరోనా ఎఫెక్ట్.. రెస్టారెంట్లు, బార్‌లు, షాపింగ్ మాల్స్ మూసివేత

by Anukaran |
కరోనా ఎఫెక్ట్.. రెస్టారెంట్లు, బార్‌లు, షాపింగ్ మాల్స్ మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. బెంగాల్‌లో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

తాజా ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలో జిమ్‌లు, రెస్టారెంట్లు, బార్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, బ్యూటీ పార్లర్లు, సినిమా థియేటర్లు మూసివేస్తున్నట్లు పేర్కొంది. మార్కెట్లు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య మాత్రమే తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది. మెడికల్ షాప్స్, హోం డెలివరీ, ఆన్‌లైన్‌ సేవలకు, నిత్యావసర సరకుల అమ్మకాలకు మినహాయింపు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed