బెంగాల్‌లో ముగిసిన ఏడో విడత పోలింగ్

by Shamantha N |
బెంగాల్‌లో ముగిసిన ఏడో విడత పోలింగ్
X

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా సోమవారం జరిగిన ఏడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడతలో 75.06 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ (ఈసీ) తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగింది. కాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దఫా పోలింగ్ లోనే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ లో ఆమె ఓటు వేశారు. ఏడో విడత పోలింగ్ సందర్భంగా రూ. 332.94 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది. బెంగాల్ లో చివరిదైన ఎనిమిదో విడత పోలింగ్ ఈనెల 29 న జరగనుండగా.. వచ్చే నెల 2న ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed