- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి రూంలోకి సడెన్‌గా వచ్చిన నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
దిశ, వెబ్ డెస్క్: తమకు మోసం చేశావంటూ నలుగురు యువతులు ఒకేసారి ఇంటికొచ్చి నిలదీయడంతో ప్రియుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం మేరకు.. కూచ్ హెబర్ జిల్లా మత్తభంగ పట్టణం సమీపంలో ఉన్న జోర్ పట్కి అనే గ్రామానికి చెందిన సుభమోయ్ అనే వ్యక్తి మెడికల్ స్టోర్ లో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. అయితే, సేల్స్ మ్యాన్ గా తనకున్న కళను అమ్మాయిలపై ప్రదర్శించాడు. ఇలా ప్రదర్శించి మొత్తం నలుగురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపించాడు. అతడి మోసం ఈ నలుగురు యువతులకు తెలిసిపోయింది. దీంతో వారంతా కలిసి ప్రియుడి ఇంటి వద్దకు వచ్చి నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేక ప్రియుడు సుభమోయ్ గదిలోకి వెళ్లి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం సుభమోయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.