- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత టూ-వీలర్ మార్కెట్లో 500సీసీ బైకులపైనే దృష్టి పెట్టనున్న బెనెల్లి
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ బైకుల తయారీ సంస్థ బెనెల్లి భారత ద్విచక్ర వాహనాల మార్కెట్లో 250-500సీసీ ఇంజన్ విభాగంపైన మాత్రమే దృష్టి సారించనున్నట్టు వెల్లడించింది. ప్రీమియం బైక్ సెగ్మెంట్‌లో ఇటీవల వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని, అందుకు తగిన విధంగా ఈ ఏడాది చివరిలోగా మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనునట్టు ప్రకటించింది. అంతేకాకుండా దేశీయంగా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు కంపెనీ తెలిపింది. ఇటీవల బెనెల్లి 502సీ పవర్ క్రూజర్ బైక్ కోసం ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించినట్టు, ఈ నెలాఖరులోగా వాటిని డెలివరీ చేయనున్నట్టు బెనెల్లీ ఇండియా బిజినెస్ హెడ్ వికాస్ జబాక్ చెప్పారు.
దేశవ్యాప్తంగా డీలర్‌షిప్ నెట్‌వర్క్ పటిష్ఠం చేసుకోవడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకోగలమని వికాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, 2018లో బీల్లీ కంపెనీ తెలంగాణకు చెందిన మహవీర్ గ్రూప్ అనుబంధ సంస్థ ఆదిశ్వర్ ఆటో రైడ్ భాగస్వామ్యంతో తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. బెనెల్లి బైక్ పోర్ట్‌ఫోలియోలో 500సీసీ విభాగంలో టీఆర్‌కే 502, టీఆర్‌కే 502 ఎక్స్, లియొన్సినో 374సీసీ మూడు మోడళ్లు ఉన్నాయి.