చెరకు రసం వల్ల ప్రయోజనాలు

by sudharani |   ( Updated:2021-02-08 03:57:02.0  )
చెరకు రసం వల్ల ప్రయోజనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భగభగ మండే ఎండల్లో చల్లదనం కోసం ఓ గ్లాస్ చెరకు రసం తాగితే ఆ మజానే వేరు. చెరకు పాలకు కొద్దిగా నిమ్మరసం ఐస్ ముక్కలు వేసి త్రాగితే ఎంతో రుచిగా ఉంటుంది. చెరకు రసం దాహం తీర్చడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. చెరకు రసం వల్ల ప్రయోజనాలెంటో తెలుసుకుందాం..

చెరకు రసంలో ఆరోగ్యానికి అవసరమయ్యే ఐరన్, కాల్షియం, మెగ్నిషీయం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడిన వారు చెరకు రసం తాగితే త్వరగా కోలుకుంటారు. వేడి చేసిన వారు ఈ రసాన్ని తీసుకోవడం ద్వారా ఒంటికి చలువ చేస్తుంది. చెరకు రసం తీసుకోవడం ద్వారా శరీరంలోని నీటిస్థాయి సమతుల్యంగా ఉంచుతుంది. దీంతో ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది. చెరకులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో షుగర్ పేషెంట్లు ఈ చెరుకు రసం తాగవచ్చు.

పచ్చ కామెర్ల సమస్య నుంచి బయటపడేందుకు చెరకు రసం ఎంతో ఉపయోగపడుతుంది. కామెర్లతో బాధపడేవారు ఒక గ్లాసు చెరకు రసంలో నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజూ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే చెరకు రసం తాగే వారిలో కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. ఎన్నో ఇన్‌ఫెక్షన్‌లను కూడా ఈ చెరకు రసం నివారిస్తుంది. డయోరియా, మూత్ర మార్గ అంటువ్యాధులు, జీర్ణ లేదా గుండె సంబంధించిన వ్యాధుల నుంచి కొంత ఉపశమనం కలిగిస్తుంది.

చెరకు రసం మధుమేహం ఉన్నవారికి ఎంతగానో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు జ్యూస్ తాగడం చాలా ఆరోగ్యకరం. చెరకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ప్రోటీన్ స్థాయిని పెంచి మూత్రశాయ ఇన్ఫెక్షన్ల భారి నుంచి కాపాడుతుంది. దంతక్షయం, నోటి దుర్వాసనతో బాధపడేవారు చెరకు రసం తీసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. చెరకులో ఉండే ప్రొస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల లేదా లంగ్, బ్రెస్ట్ కాన్సర్ కారకాలను కూడా నిరోధిస్తుంది.

Advertisement

Next Story