- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది ఐసీసీ అవార్డా? ఆస్ట్రేలియా క్యాపా?
దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవలే దశాబ్దపు అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దశాబ్దపు టెస్టు క్రికెట్ జట్టును కూడా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెస్టు క్రికెటర్లలో ఉత్తమ ప్రదర్శన చేసిన 11 మందిని ఈ జట్టులో ఉంచారు.దీనికి విరాట్ కోహ్లీకి కెప్టెన్‌ని చేయగా.. అందులో బెన్ స్టోక్స్‌కూడా స్థానం సంపాదించాడు. కాగా, దశాబ్దపు టెస్టు జట్టులో స్థానం సంపాదించిన వారికి ఐసీసీ టెస్టు క్యాప్‌లు బహుకరించింది. దానిపై స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘దశాబ్దపు అవార్డుల్లో టెస్టు జట్టు సభ్యులకు ఇచ్చిన క్యాప్ ఆస్ట్రేలియా జట్టు వేసుకొని బ్యాగీ గ్రీన్ కలర్‌లో ఉన్నది. ఇది నాకు అసంతృప్తిని కలిగించింది. నాకు ఈ అవార్డు రావడం గర్వకారణంగానే ఉన్నది కానీ బ్యాగీ గ్రీన్ క్యాప్ ధరించడం నచ్చలేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి ఐసీసీ కూడా సమాధానం ఇస్తూ.. ‘సారీ బెన్ స్టోక్స్’ అంటూ ఒక లాఫింగ్ ఎమోజీని జత చేసింది. కాగా, క్రికెట్‌లో ఎన్నో ఏళ్లుగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య శత్రుత్వం నడుస్తున్నది. యాషెస్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతుంటాయి.