హార్ధిక్ కంటే స్టోక్స్ బెటర్

by Shyam |   ( Updated:2020-03-24 08:53:02.0  )
హార్ధిక్ కంటే స్టోక్స్ బెటర్
X

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కన్నాఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్.. గొప్ప ఆల్‌రౌండర్ అని ఆస్ట్రేలియన్ మాజీ చైనామన్ బౌలర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. మంగళవారం ట్విట్టర్‌లో క్రికెట్‌లో ఆల్‌రౌండర్ల గురించి కొన్ని విశేషాలు చెప్పిన అనంతరం.. ఒక ఫ్యాన్ మీ దృష్టిలో బెన్ స్టోక్స్, హార్ధిక్ పాండ్యాలలో ఎవరు బెస్ట్ ఆల్‌రౌండర్ అని ప్రశ్నించగా.. హాగ్ పై విధంగా సమాధానం స్పందించాడు. హార్ధిక్ పాండ్యాకు ఎంతో సామర్థ్యం ఉంది కానీ, అతడికి అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం అంతగా లేదు. అందుకే నా వరల్డ్ ఎలెవెన్ జట్టులో ఆల్‌రౌండర్‌గా బెన్ స్టోక్స్‌నే ఎంచుకుంటానని హాగ్ అన్నాడు.

గతంలో కూడా హార్థిక్ పాండ్యాను పలువురు ఆల్‌రౌండర్లతో పోల్చారు. కాగా, పాండ్యా ఎప్పటికప్పుడు తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే వెన్ను నొప్పి గాయం నుంచి కోలుకున్న పాండ్యా.. డీవై పాటిల్ టోర్నీలో రిలయన్స్ జట్టు తరపున అద్భుతంగా రాణించాడు. అంతే కాకుండా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు.

Tags: Hardik Pandya, Cricket allrounder, Ben stokes, England, Twitter

Advertisement

Next Story

Most Viewed