కియారానే బెల్లంకొండ టార్గెట్..

by Shyam |   ( Updated:2020-11-29 05:17:42.0  )
కియారానే బెల్లంకొండ టార్గెట్..
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తనను తెలుగులో లాంచ్ చేసిన దర్శకుడు వీవీ వినాయక్, ఇప్పుడు హిందీలోనూ లాంచ్ చేస్తుండగా.. సూపర్ హ్యాపీగా ఉన్నాడు. పైగా ప్రభాస్ మూవీ రీమేక్ కాబట్టి మరింత ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు. అయితే నార్మల్‌గానే తన సినిమా హీరోయిన్ల విషయంలో చాలా కేర్ తీసుకునే బెల్లంకొండ.. మరి ఇప్పుడు బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి మరింత కేర్ తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్‌నే దింపాలని చూస్తున్నాడు. ఎన్ని కోట్లయినా సరే తగ్గేది లేదనే పట్టుదలతో ఉన్నాడు.

ఇంతకీ తాను సెలక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.. బాలీవుడ్‌లో స్టార్స్‌తో రొమాన్స్ చేస్తూ ఫుల్ ఆన్ స్వింగ్‌లో ఉన్న కియారా అద్వానీ. ప్రస్తుతం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న తను ‘ఛత్రపతి రీమేక్’ చేస్తే సినిమాకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఉన్నాడు బెల్లంకొండ. రెమ్యునరేషన్ నాలుగైదు కోట్లయినా సరే.. హీరోయిన్‌గా ఫైనల్ చేయించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. మరి బిజీ షెడ్యూల్‌తో ఉన్న కియార డేట్స్ సర్దుబాటు చేస్తుందా? ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? చూడాలి.

Advertisement

Next Story