టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలు ప్రకటించిన బెల్లం వేణు

by Sridhar Babu |   ( Updated:2021-10-09 07:52:04.0  )
టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలు ప్రకటించిన బెల్లం వేణు
X

దిశ, ఖమ్మం రూరల్: 2023 సాధారణ ఎన్నికల్లో పాలేరులో గెలవడమే లక్ష్యంగా రూరల్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలను ఎంపిక చేసినట్లు రూరల్ మండల టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు తెలిపారు. శనివారం రూరల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల గ్రామ కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కందాల ఉపేంద్రరెడ్డి సూచనల మేరకు గ్రామ కమిటీల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించామని, గ్రూపులు లేకుండా చేసినట్లు తెలిపారు. సత్తా ఉన్న నాయకులకు మాత్రమే ప్రాధాన్యత కల్పించినట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండలంలో జయకేతనం ఎగురవేసినట్లు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నూతన కమిటీ ఆధ్వర్యంలో మంచి మెజార్టీని సాధించించేందుకు కృషి చేయాలన్నారు.

కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న రూరల్ మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీలను ప్రజల ఆశీర్వాదంతో టీఆర్‌ఎస్ సాధించినట్లు తెలిపారు. తప్పులు ఎవరు చేపినా ఊపేక్షించేది లేదన్నారు. కూసుమంచిలో జరిగిన సంఘటనను ఆయన టీకప్పులో తూపాన్‌గా వర్ణించారు. కుటుంబంలో వచ్చిన చిన్నపాటి సమస్య అని ఎమ్మెల్యే కందాల సమక్షంలో ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. దానికే కొంతమంది ఏదో అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తగదన్నారు. అనంతరం రూరల్ మండలంలోని మూడు డివిజన్లతో పాటు మొత్తం 28 గ్రామాలకు కమిటీలను ప్రకటించారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, రైతు సమన్వయసమితి కన్వీనర్ అక్కినపల్లి వెంకన్న, వైస్ ఎంపీపీ దరగయ్య, ముత్యం క్రిష్ఱరావు, మంకెన నాగేశ్వరరావు, పేరం వెంకటేశ్వర్లు, అంజనేయులు, వెంపటి రవి, మట్టా వెంకటేశ్వరరావు, మేకల ఉదయ్, వెంకటేష్, తదితర నాయకులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed