- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న బెల్జియం!
బ్రస్సెల్స్: కరోనా వైరస్ నేపథ్యంలో బెల్జియం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. దేశ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజులుగా బెల్జియంలో కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గతవారం సగటున రోజుకు 6వేల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. దీంతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై బెల్జియం ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశ వ్యాప్తంగా నెలరోజులపాటు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది.
- Tags
- belgium