టీ20 వరల్డ్ కప్ శ్రీలంకకు తరలింపు?

by Shiva |
టీ20 వరల్డ్ కప్ శ్రీలంకకు తరలింపు?
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ వేదిక విషయంలో రోజుకో వార్త బయటకు వస్తున్నది. ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో యూఏఈ, ఒమన్ వేదికలుగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇదే విషయాన్ని ఐసీసీ ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో బీసీసీఐకి కూడా తెలిపింది. ఆతిథ్య హక్కులు తమకే కేటాయిస్తే యూఏఈ, ఒమన్ వేదికలకు ఒప్పుకుంటామని బీసీసీఐ షరతు కూడా పెట్టింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. టీ20 వరల్డ్ కప్‌ను శ్రీలంకకు తరలించడానికి బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. యూఏఈలోని అంతర్జాతీయ స్టేడియంలలో ఐపీఎల్ నిర్వహిస్తున్నందున వరల్డ్ కప్ అక్కడ జరపకపోవడమే మంచిదని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. శ్రీలంకలో ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గింది.

జులైలో భారత జట్టు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం అక్కడ పర్యటించనున్నది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో వరల్డ్ కప్ అక్కడ నిర్వహిస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవని బీసీసీఐ అనుకుంటున్నది. శ్రీలంకలో అంతర్జాతీయ స్థాయి స్టేడియంలో అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే ఇంగ్లాండ్ జట్టు కూడా అక్కడ పర్యటించింది. యూఏఈ, ఒమన్ రెండు చోట్ల వరల్డ్ కప్ నిర్వహించడం కంటే.. శ్రీలంకనే వేదికగా చేయాలనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఇదే విషయంపై శ్రీలంక క్రికెట్ బోర్డుతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. మరి ఈ ప్రతిపాదనను ఐసీసీ అంగీకరిస్తుందో లేదో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed