విరాట్ కోహ్లీ చెప్పేవన్నీ అబద్దాలు.. బీసీసీఐ సంచలన వ్యాఖ్యలు

by Anukaran |
Ganguly_Virat_Kohli_PTI_AP2
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే కెప్టెన్‌గా తనను తప్పిస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. విరాట్ కోహ్లీ మీడియా సమక్షంలో చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ తీవ్రంగా ఖండించింది. టీ20 కెప్టెన్సీ వద్దని కోహ్లీ చెప్పినప్పుడే వద్దు అని ఎంత చెప్పినా వినలేదని.. ఇలా అయితే వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోవాల్సి వస్తోందని ముందే చెప్పినట్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ విరాట్ తమను లెక్కచేయకుండా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదే విషయాన్ని సెలక్షన్ కమిటీ చేతన్ శర్మ.. వైట్‌బాల్‌ క్రికెట్‌కు రెండు కెప్టెన్లు ఉంటే సమన్వయ లోపం వస్తుందని.. అందుకే రోహిత్‌కు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు విరాట్‌కు సమాచారం ఇచ్చారని చెప్పుకొచ్చింది. మరోవైపు గంగూలీ కూడా కోహ్లీకి సమాచారం ఇచ్చామని మీడియాతో చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. అసలు ఎవరి మాట నిజమో తెలియక అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. ముఖ్యంగా బీసీసీ‌ఐ‌పై మండిపడుతున్నారు. ఇది ఇలా ఉంటే దేశ క్రికెట్ బోర్డుకు, ఒక స్టార్ ప్లేయర్‌కు మధ్య సయోధ్య లేకపోవడం ఆ జట్టు క్రికెటర్లతో పాటు, టీమిండియా అభిమానులను ఆందోళనలో పడేసిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed