ఇక్కడ జరపలేం.. అక్కడ ఖర్చు భరించలేం

by Shyam |
ఇక్కడ జరపలేం.. అక్కడ ఖర్చు భరించలేం
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహణపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్నది. ఈ ఏడాది లీగ్ నిర్వహించకపోతే భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏదో ఒక సమయంలో ఐపీఎల్ నిర్వహణకు మార్గాలను అన్వేషిస్తున్నది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదా పడనున్నట్లు సమాచారం అందుతుండటంతో ఐపీఎల్ నిర్వహణకు సమయం దొరికింది. కానీ, ఎక్కడ నిర్వహించాలనేది మాత్రం తేల్చుకోలేక పోతున్నది. ‘ఐపీఎల్‌ను ఇండియాలో నిర్వహిస్తాం. విదేశాల్లో నిర్వహించాలనేది తమ చివరి ఆప్షన్ మాత్రమే’ అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వ్యాఖ్యానించారు. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు మాత్రం విభిన్నంగా స్పందించారు. ‘మనకు దొరికిన సమయంలోగా ఐపీఎల్ ఆడగలమా లేదా అనేది మొదటి ప్రశ్న. ఇక ఐపీఎల్ వేదిక ఇండియాలోనా విదేశాల్లోనా అనేది రెండో ప్రశ్న. ముంబయి, అహ్మదాబాద్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడా ఆడే పరిస్థితులు లేవు. ఇక విదేశాల్లో ఖర్చు భరించే పరిస్థితి. ఫ్రాంచైజీలు కూడా విదేశాలకు రావడానికి ఖర్చుకు వెనుకాడుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించి ఐపీఎల్‌కు సరైన పరిష్కారం కనుగొనడం మా ముందున్న బాధ్యత’ అని గంగూలీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed