ఐపీఎల్ ఫ్రాంచైజీలకు రూ.183 కోట్లు చెల్లించిన బీసీసీఐ !

by Shyam |
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు రూ.183 కోట్లు చెల్లించిన బీసీసీఐ !
X

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఉన్న 8 ఫ్రాంచైజీలకు నాలుగో వాయిదా కింద చెల్లించాల్సిన రూ. 183.46 కోట్లను బీసీసీఐ చెల్లించింది. ప్రతీ ఏడాది నిర్వహించే ఐపీఎల్ ద్వారా లభించే ఆదాయంలో నిర్ణీత మొత్తాన్ని బీసీసీఐ ఫ్రాంచైజీలకు చెల్లిస్తుంటుంది. ప్రతీ సీజన్‌లో ఆడే మ్యాచ్‌లు, లభించిన ఆదాయం ప్రకారం ఈ మొత్తాన్ని లెక్కగట్టి నాలుగు వాయిదాల్లో చెల్లిస్తుంది. కాగా, 2019 ఐపీఎల్ ఆదాయానికి సంబంధించిన చివరి వాయిదాను గత నెల చివర్లోనే చెల్లించినట్లు బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

గత ఏడాది బకాయిల నుంచి చెల్లించిన మొత్తాలు ఇవే

ఢిల్లీ డేర్ డెవిల్స్ – రూ. 25,78,40,000
సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ. 22,68,00,000
రాజస్థాన్ రాయల్స్ – రూ. 21,60,00,000
కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 22,68,00,000
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 20,52,00,000
ముంబై ఇండియన్స్ – రూ. 24,84,00,000
చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 23.76,00,000
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ – రూ. 21,60,00,000

Tags: Cricket, BCCI, IPL, Franchises, Payment, Instalment

Advertisement

Next Story