- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిల్‌పై సబా కరీమ్ వ్యాఖ్యలను ఖండించిన బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తనకు అయిన గాయాన్ని దాచిపెట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాడని బీసీసీఐ మాజీ క్రికెట్ డైరెక్టర్ సబా కరీమ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీమ్ ఇండియా మెడికల్ టీమ్ కళ్లుగప్పి అతడు తన గాయాన్ని దాచిపెట్టాడని కరీం ఆరోపించాడు. అంతే కాకుండా గిల్ స్థానంలో పృథ్విషాను తీసుకుంటున్నారని కూడా అన్నాడు. దీనిపై బీసీసీఐ ఘాటుగా స్పందించింది.
‘బీసీసీఐలో ఉన్నత పదవిలో పని చేసిన సబా కరీంకు బోర్డు నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసు. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫిట్‌నెస్ విషయంలో అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తారనేది బహిరంగ రహస్యమే. కానీ అలాంటి వ్యక్తి ఏకంగా టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్, ఫిజియో, ట్రైనర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్ టూర్‌లోనే గిల్ గాయపడ్డాడు. కానీ అతడి గాయం మ్యాచ్ ఫిట్‌నెస్‌ను తగ్గించే అంత లేదు. గతంలో బీసీసీఐ జనరల్ మేనేజర్‌గా చేసిన సబా కరీంకు అలాంటి చిన్న గాయాల వల్ల ఏమీ కాదని కూడా తెలిసినా బోర్డును ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యానించడం తగదు అని సదరు అధికారి వ్యాఖ్యానించారు.