- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫిబ్రవరిలో ఐపీఎల్ మినీ ఆక్షన్ ?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ రెండో వారం తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి రెండు కొత్త టీమ్స్ జత చేస్తారని వార్తలు వచ్చినా.. బీసీసీఐ 2022కు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ లోపు ఐపీఎల్ ఫ్రాంచైజీల డిమాండ్ మేరకు మినీ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం 2020 సెప్టెంబర్‌లో ఐపీఎల్ మెగా వేలం జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సెప్టెంబర్-నవంబర్ మధ్య యూఏఈలో నిర్వహించారు. దీంతో మెగా వేలం పాటను రద్దు చేశారు. ఇవే జట్లను వచ్చే సీజన్ కూడా కొనసాగించాలి బీసీసీఐ నిర్ణయించింది. అయితే తమకు కొత్త ఆటగాళ్లు కావాలని.. మినీ వేలం నిర్వహించమంటూ ఫ్రాంచైజీలు డిమాండ్ చేశాయి. దీంతో ఫిబ్రవరి రెండో వారంలో మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ స్నద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ మినీ వేలంపై ఈ నెల 24న జరిగే మినీ వేలంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.