ఆటగాళ్లతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దు : బీసీసీఐ

by Shyam |
BCCI
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు కొత్త జట్లు ముగ్గురు ఆటగాళ్లను ఫ్రీ పికప్ చేసుకునే వీలుంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25 వరకు ఈ ఫ్రీ ఆప్షన్ అందుబాటులోకి రావల్సి ఉన్నది. అయితే అహ్మదాబాద్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్స్‌పై పలు ఆరోపణలు రావడంతో ప్రస్తుతానికి ఈ అవకాశాన్ని పెండింగ్‌లో పెట్టింది. సీవీసీ క్యాపిటల్స్‌కు బెట్టింగ్ కంపెనీల్లో వాటాలున్నాయనే విషయంపై విచారణ జరుగుతున్నది. ఈ విషయంపై స్పష్టత వచ్చే వరకు ఆటగాళ్లతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని లక్నో ఫ్రాంచైజీకి బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆటగాళ్లతో చర్చలు జరపడం లేదా ఒప్పందం కోసం ప్రయత్నించడం నిబంధనలకు విరుద్దమని పేర్కొన్నది. ఇప్పటికే లక్నో జట్టు కేఎల్ రాహుల్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా జెర్సీ స్పాన్నర్‌గా కూడా ప్రముఖ కంపెనీని నియమించుకున్నట్లు తెలుస్తున్నది. అయితే బీసీసీఐ ఆదేశాలతో లక్నో ప్రస్తుతానికి ఒప్పందాలకు విరామం ప్రకటించినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed