చిన్నబోర్డులకు బీసీసీఐ బంపర్ ఆఫర్

by Shyam |
చిన్నబోర్డులకు బీసీసీఐ  బంపర్ ఆఫర్
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రకాల ఆటల పోటీలకు బ్రేక్ పడింది.ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆట కూడా నిలిచిపోయింది. దీంతో పలు చిన్న క్రికెట్ బోర్డులు ఆదాయం లేక తమతమవుతున్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి బోర్డుల ఆదాయం ఆగిపోవడంతో ఉద్యోగుల తొలగింపు, క్రికెటర్ల వేతనాల్లో కోత వంటి చర్యలు చేపట్టాయి. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఇలాంటి కోతలు, తొలగింపులు చేపట్టలేదు. కానీ, అదే సమయంలో నష్టాలపాలవుతున్న చిన్న క్రికెట్ బోర్డులను ఆదుకోవడానికి ఒక ప్రణాళికతో ముందుకు వచ్చింది. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత చిన్న దేశాలతో భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటానికి సిద్ధంగా ఉందని.. ఏ చిన్న దేశమైనా తమతో ఆడటానికి సిద్ధపడితే తెలియజేయాలని ప్రకటించింది. ఆదాయం పెంచుకోవాలంటే ఇండియాతో ఆడటమే సరైన నిర్ణయమని ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా బాహాటంగానే ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిన్న క్రికెట్ దేశాలకు బీసీసీఐ ఆఫర్ బంగారు బాతుగుడ్డు లాటిందే. మరి ఏయే దేశాలు ఇండియాతో క్రికెట్ ఆడటానికి ముందుకు వస్తాయో వేచి చూడాల్సిందే.

Tags : Team India, BCCI, Offer, Cricket Boards, Coronavirus, Financial crisis

Advertisement

Next Story

Most Viewed