- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త కమిటీలు ఏర్పాటు చేసిన బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ 90వ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఇటీవల కోల్‌కతాలో నిర్వహించారు. ఆ సమయంలో పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం నాలుగు కమిటీలు ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ శనివారం ప్రకటించింది. టూర్స్, ఫిక్సర్స్, టెక్నికల్ టీమ్‌లో అమితాబ్ విజయ్‌వర్గీయ, జయేంద్ర సహ్‌గల్, రఘురాం భట్, ప్రబిర్ చక్రబర్తి, హరి నాయాయణ్ పుజారి సభ్యులుగా ఉన్నారు. సీనియర్ టోర్నమెంట్ కమిటీలో విశాల్ జోగొట, వికాస్ కత్యాల్, రాజేశ్ గార్సొండియా, సురేంద్ర శివాలే, లాల్‌రొతుమా సభ్యులుగా ఉన్నారు. అంపైర్స్ కమిటీలో అమిశ్ సాహెబా, క్రిష్ణ హరిహరన్, సుధీర్ అస్నాని సభ్యులుగా ఉండగా.. డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీలో రవికాంత్ చౌహాన్, సుమిత్ జైన్, మహంతేశ్ సభ్యులుగా ఉన్నారు.
మరోవైపు బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిజిత్ సాల్వి తన పదవికి రాజోనామా చేశారు. వాస్తవానికి ఆయన గతంలోనే రాజీనామా చేసి నోటీస్ పిరియడ్‌లో ఉన్నారు. నవంబర్ 30కే నోటీస్ పిరియడ్ గడువు తీరిపోయింది. అయితే న్యూజీలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఉన్నందున బీసీసీఐ అభ్యర్థన మేరకు మరి కొన్ని రోజులు జట్టుతో ఉన్నారు. బీసీసీఐతో 10 ఏళ్ల ప్రయాణం అద్భుతంగా జరిగిందని.. తాను ఇక విభిన్నంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతోరాజీనామా చేసినట్లు చెప్పారు. కీలకమైన కరోనా సమయంలో ఒక సవాలుగా తీసుకొని పని చేశానని ఆయన చెప్పారు