నేడే కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం

by Shamantha N |   ( Updated:2021-07-27 21:55:51.0  )
నేడే కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ సోమప్ప బొమ్మై(61)ని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ రోజు(బుధవారం) ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయడంతో కర్ణాటకలో సీఎం పదవి ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో శక్తివంతమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్ప స్థానంలో అతనికి సన్నిహితుడిగా, నమ్మకస్తుడైన బసవరాజ్‌ను ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు. యడ్యూరప్ప బసవరాజ్ పేరును ప్రతిపాదించగా, ధర్మేంద్ర ప్రధాన్ బసవరాజ్ పేరును ప్రకటించాడు. రేసులో పలువురు ఉన్నప్పటికీ ఉత్తర కర్ణాటక, లింగాయత్‌ వర్గానికే సీఎం పీఠం కట్టబెట్టాలని బీజేపీ హైకమాండ్‌ భావించింది. దీంతో బొమ్మై సీఎం పదవికి ఎంపికయ్యారు. బసవరాజ్ ఉదయం 11 గంటలకు బెంగళూరులోని రాజ్‌భవన్‌లో 30వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Next Story