- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హామీలేని వ్యక్తిగత రుణాలిచ్చేందుకు సిద్ధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సంక్షోభం సమయంలో కరోనా బారిన పడిన కుటుంబాల కోసం హామీలేని వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నట్టు దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎస్‌బీఐ మాత్రమే కాకుండా దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఎలాంటి హామీ లేకుండా రుణాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రుణాలను అందుబాటులో ఉంచినట్టు దినేష్ ఖారా పేర్కొన్నారు. గరిష్ఠంగా ఐదేళ్ల వరకు రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల రుణాలను ఇవ్వనున్నట్టు ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ రకమైన రుణాలకు బ్యాంకు 8.50 శాతం వడ్డీన్ వసూలు చేయనున్నట్టు దినేష్ ఖారా తెలిపారు. ఇది బ్యాంకులను బట్టి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం కింద కరోనా చికిత్స కోసం రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ సమావేశమ్ళో భారత బ్యాంకుల అసోసియేషన్(ఐబీఏ) ఛైర్మన్ రాజ్ కిరణ్ రాయ్ సహా ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా పాల్గొన్నారు.