రుణ ఎగవేత కంపెనీల వల్ల పీఎస్‌బీలకు రూ. 2.85 లక్షల కోట్ల నష్టం!

by Harish |
bank
X

దిశ, వెబ్‌డెస్క్: యెస్ బ్యాంక్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ లాంటి ఆర్థిక సంస్థలను కష్టాల నుంచి కాపాడేందుకు బ్యాంకులు దాదాపు రూ. 2.85 లక్షల కోట్లను నష్టపోయాయని యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) సోమవారం వెల్లడించింది. మొత్తం 13 కార్పొరేట్ సంస్థల రుణ బకాయిలను తీర్చడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ నష్టాలను ఎదుర్కొన్నాయని యూఎఫ్‌బీయూ తెలిపింది.

కేంద్రం చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) ప్రవేటీకరణను బ్యాంకింగ్ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకుల విలీనం వల్ల తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు ప్రైవేటీకరణతో మొత్తం బ్యాంకింగ్ రంగమే ప్రమాదంలోకి వెళ్తుందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కేంద్రం పార్లమెంట్ సమావేశాల్లో బ్యాంకులు, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును ఆమోదానికి ప్రయత్నిస్తున్న క్రమంలో యూఎఫ్‌బీయూ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టాయి.

ఈ నెల 16,17 తేదీల్లో సమ్మె చేపట్టేందుకు పిలుపునిచ్చిన ప్రకటనలో యూఎఫ్‌బీయూ కన్వీనర్ రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎఫ్‌బీయూ ఇచ్చిన గణాంకాల ప్రకారం.. 13 కార్పొరేట్ బ్యాంకుల బకాయిలు రూ. 4,86,800 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ. 1,61,820 కోట్లు పరిష్కరించబడ్డాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 2,84,980 కోట్ల నష్టం వాటిల్లింది. పీఎస్‌యూలు జన్‌ధన్ ఖాతాలు, నిరుద్యోగ యువత కోసం ముంద్ర లోన్, వీధి వ్యాపారుల కోసం స్వధన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ సహా పలు ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాలకు పీఎస్‌బీలు ఉంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలు, వెనుబడిన ప్రాంతాల ప్రయోజనాలకు ఆటంకం ఏర్పడుతుందని యూఎఫ్‌బీయూ అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed