బ్యాంకు ఉద్యోగులకు దీపావళి ధమాక..

by Shamantha N |
బ్యాంకు ఉద్యోగులకు దీపావళి ధమాక..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకు ఉద్యోగులకు నవంబర్ 14 కంటే ముందే దీపావళి పండుగొచ్చింది. అందుకు కారణం. చాలా ఏండ్లుగా పెండింగ్‌లో వేతన సవరణకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. బ్యాంకు ఉద్యోగులు, భారతీయ బ్యాంకుల అసోసియేషన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు 15శాతం వేతన పెంపును అందుకోనున్నారు.

ఈ పెరిగిన వేతనాన్ని ఉద్యోగులంతా నవంబర్ నెల జీతంతో కలిపి పొందనున్నారు. వేతనాల పెరుగుదలతో దాదాపు 5లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. తాజా వేతన సవరణ వలన బ్యాంకులపై ఏటా రూ. 7900కోట్ల భారం పడనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీపావళి పండుగకు ముందే భారతీయ బ్యాంకు అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పడంతో బ్యాంకు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story