మార్చి 27 నుండి ఏప్రిల్ 4 వరకు బ్యాంకులు బంద్..!

by Anukaran |   ( Updated:2021-03-21 06:28:18.0  )
మార్చి 27 నుండి ఏప్రిల్ 4 వరకు బ్యాంకులు బంద్..!
X

దిశ, వెబెడెస్క్ : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ నెల 27 నుండి ఏప్రిల్ 4 వరకు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రెండవ శనివారం, హోలీ పండుగ సందర్భంగా మార్చి 27-29 నుండి మూడు రోజులు బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెలవుల జాబితా ప్రకారం.. మార్చి 30న కూడా సెలవుదినం కావడంతో పాట్నాలోని బ్యాంక్ శాఖలు వరుసగా 4 రోజులు మూసివేయబడతాయి. 31 మార్చి సెలవుదినం కాదు కాని ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో బ్యాంకు సేవలు నిలపిపోనున్నాయి.

ఓ సారి సెలవులను చూసుకుంటే..

మార్చి 27 – చివరి శనివారం.
మార్చి 28 – ఆదివారం.
మార్చి 29 – హోలీ హాలిడే.
మార్చి 30 – పాట్నా బ్యాంకు శాఖలో సెలవు.
మార్చి 31 – ఆర్ధిక సంవత్సరం ముగింపు సెలవు.
1 ఏప్రిల్ – ఖాతాల బ్యాంక్ ముగింపు(బ్యాంకుల ఆడిటింగ్).
2 ఏప్రిల్ – గుడ్ ఫ్రైడే.
3 ఏప్రిల్ – శనివారం.. వర్కింగ్ డే.
4 ఏప్రిల్ – ఆదివారం.

Advertisement

Next Story