- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగులోనే బ్యాంకు క్లరికల్ పోస్టుల ఎగ్జామ్స్..?
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు నిర్వహించాలని దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా తెలంగాణలో తెలుగులోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్ పోస్ట్ ల భర్తీకి ఎగ్జామ్స్ నిర్వహించనుంది. ఇప్పటివరకు ఇంగ్లీష్, హిందీలో నిర్వహించడం జరుగుతుంది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ తెలుగులో కూడా ఎగ్జామ్స్ నిర్వహించాలని భావించింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ ఉద్యోగాల భర్తీకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు పరీక్షలను నిలుపుదల చేయాలంటూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకు పర్సనల్ సెలక్షన్స్ (ఐబీపీఎస్)కు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఈనెల 11న నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 5890 భర్తీ చేయనున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో 263, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 263 క్లరికల్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లబ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్లో అప్లికేషన్ చివరి తేదీ ఆగస్టు 1 గా ప్రకటించారు.
ప్రభుత్వ రంగ క్లరికల్ పోస్టుల భర్తీని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 15 రోజుల్లోగా నివేదికను ఇవ్వనుంది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లీషులో పరీక్షలు నిర్వహిస్తుంది. వీటితో పాటు ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు 2019 జూలై లో పార్లమెంట్లో స్పష్టం చేసింది. ఆ హామీ మేరకు తాజా ఆదేశాలు వెలువడినట్లు సమాచారం. అప్పటివరకు పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉంది. కేంద్రం నుంచి సైతం స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది.