కల్వకుంట్ల కవితకు బండ్ల గణేశ్ కౌంటర్

by Anukaran |   ( Updated:2020-11-29 06:24:26.0  )
కల్వకుంట్ల కవితకు బండ్ల గణేశ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గత ముందస్తు ఎన్నికల్లో బండ్ల గణేశ్ కామెడీ చేసి ప్రజలందరినీ నవ్వించాడు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండ్ల గణేశ్‌కు మించిన కమెడియన్‌.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అయ్యారు. పూటకో మాట.. రోజుకో వేషం వేసి ప్రజలను కామెడీతో ఆకట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్య వంతులు.. ఇలాంటి కమెడియన్, ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్ట్‌ల మాటలు పట్టించుకోరు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దీక్ష దివాస్ చాలా కీలకమైన ఘట్టం, అదే స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయాలి. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు పైగా డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన బండ్ల గణేశ్.. కవిత గారు.. నేను జోకర్‌ను కాదు ఫైటర్‌ను. కానీ ఇప్పుడు నేను పాలిటిక్స్‌లో ఉండాలనుకోవడం లేదు. ఆల్‌ దిబెస్ట్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. గణేశ్ అన్న మీరు మాస్ అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/ganeshbandla/status/1332933953104187393?s=20

Advertisement

Next Story

Most Viewed