- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితబంధు అడుగుతారని KCR కొత్త నాటకానికి తెర లేపారు : బండి సంజయ్
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో రైతుల సమస్యలను సీఎం కేసీఆర్‌కు తెలియజేసేందుకే ధాన్యం కొనుగోళ్ల దగ్గరికి వెళ్లామని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రైతులతో మాట్లాడేందుకు వెళ్తే రాళ్లు, గుడ్లు, కర్రలతో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని, ఈ క్రమంలో రైతులకు కూడా గాయాలయ్యాయని అన్నారు. రైతుల కోసం రాళ్ల దాడి, దెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాళ్ల దాడిలో బీజేపీ కార్యకర్తలు 70 మందికి గాయాలయ్యాయని, అందులో 15 మందికి తలలు పగిలి ఆసుపత్రి పాలయ్యారని వెల్లడించారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడిని వీడియో తీస్తున్నారని మీడియాపైన కూడా దాడి చేశారని మండిపడ్డారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలకు మద్దుతుగా ఉన్నారంటూ ఆరోపణలు చేశారు.
దసరా నుంచి రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల దగ్గర ఉంచినా ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు. బీజేపీ నాయకులు వస్తున్నారని వెంట వెంటనే ధాన్యం కొన్నారని రైతులు చెబుతున్నారన్నారని సంజయ్ తెలిపారు. ఇది బీజేపీ సాధించిన విజయం కాదా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కొనుగోళ్లు సరిగా చేయకపోవడం వల్లే ధాన్యం కుప్పలపై రైతులు చనిపోయారని విమర్శించారు. కేవలం దళిత బంధు అమలుపై ప్రజలంతా ఉద్యమం చేస్తారనే.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లు అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు.