2023లో విజయం మాదే : బండి సంజయ్

by Shyam |
2023లో విజయం మాదే : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మరికల్ మండలం అప్పంపల్లిలో స్వామివివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. కొందరు కావాలనే బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏ మతాన్ని కించపరచడం లేదని, తమకు అన్ని మతాలు సమానం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed