ఈటల నినాదాలతో మార్మోగిన ఎంపీ ఆఫీస్.. సన్మానించిన బండి సంజయ్

by Sridhar Babu |   ( Updated:2021-11-04 06:18:35.0  )
ఈటల నినాదాలతో మార్మోగిన ఎంపీ ఆఫీస్.. సన్మానించిన బండి సంజయ్
X

దిశ, కరీంనగర్ సీటి : మాజీ మంత్రి, బీజేపీ నేత, హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటెల రాజేందర్ ను ఆ పార్టీ స్టేట్ చీఫ్, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గురువారం ఘనంగా సన్మానించారు. ఎంఎల్ఏ గా గెలిచిన అనంతరం మొదటిసారిగా ఎంపీ కార్యాలయానికి వచ్చిన ఈటెలకు సంజయ్ ఎదురెల్లి స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నిక అనుభవాల గురించి మాట్లాడుకున్నారు. ప్రచారంలో సవాల్ చేసిన విధంగా గెలిపించి, సీఎం కేసీఆర్ కు పరాభావం కలిగేలా ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల ఆనందాన్ని పంచుకున్నారు. రాజేందర్ ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎన్నికైన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు స్థానిక బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అంతకుముందు బీసీ సంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా బీసీ నాయకులు ఆయనకు స్వాగతం పలికేందుకు పోటీ పడ్డారు. బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో రాజేందర్‌కు శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ఎంపీ సంజయ్ కార్యాలయంలో జై ఈటల నినాదాలు మారుమోగాయి. అక్కడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన రాజేందర్‌ సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి చౌరస్తాలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నాకు టైం వస్తుంది రెడీగా ఉండు హరీశ్‌.. ఈటల షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story