బిపిన్​రావత్ సాహసం అసామాన్యం : బండి సంజయ్

by Shyam |
బిపిన్​రావత్ సాహసం అసామాన్యం : బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హెలికాప్టర్ దుర్ఘటనలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సాహసం అసామాన్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కొనియాడారు. రావత్​ దంపతుల పార్థీవ దేహానికి శుక్రవారం ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న బిపిన్ రావత్ గొప్ప వీరుడని అన్నారు.

రావత్‌తోపాటు వీర సైనికులను కోల్పోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. శత్రు దేశాల నుంచి భారత్‌ను రక్షించే క్రమంలో ప్రత్యేక పంథాను కొనసాగిస్తూ సేవలందించిన బిపిన్ రావత్ ప్రతిభాపాటవాలు, సాహసాలు చూస్తే ప్రతీ భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయన్నారు. ఈ ఘటనలో దుర్మరణం పొందిన తెలుగు తేజం సాయితేజ సేవలు చిరస్మరణీయమని, బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Advertisement

Next Story