కేసీఆర్‌కు అంతా తెలుసు.. టెస్టులకు నేను రెడీ.. మరి మీరు? : బండి

by Shyam |
కేసీఆర్‌కు అంతా తెలుసు.. టెస్టులకు నేను రెడీ.. మరి మీరు? : బండి
X

దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్‌తో సంబంధం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కరోనా టెస్టులకు బదులు టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలన్నారు. కారు పార్టీలో డ్రగ్స్ ఎవరెవరు తీసుకుంటున్నారో సీఎం కేసీఆర్‌కు తెలుసునని ఈ సందర్బంగా బండి సంజయ్ వెల్లడించారు. ఆ ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? తాను రెడీగా ఉన్నానని బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

Advertisement

Next Story