ఓపికను పిరికితనం అనుకుంటున్నారా: బండి సంజయ్

by srinivas |
ఓపికను పిరికితనం అనుకుంటున్నారా: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారికి ట్విట్టర్‌ ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేవుళ్లను అవమానించిన వారికి తగిన బుద్ధి చెప్పాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘అంతర్వేదిలో రథం తగులబెట్టారు.. సింహాచలం దేవస్థానంలో బోర్డులో మార్పులు.. దేవుళ్ల విగ్రహాల విధ్వంసం.. హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నారా.. ఓపికను పిరికితనంగా భావిస్తున్నారా…!? తిరుపతిలో నివసిస్తున్న హిందువులు ఓటు బ్యాంకుగా మారాలి.. తిరుపతి ప్రజలు స్వామి వారి అవమానానికి బుద్ధి చెప్పాలి.. తిరుపతిలో ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులనే గెలిపించాలి.. హిందువులకు అతిపెద్దదైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో బిజెపిని గెలిపించి ధర్మ రక్షణకు పాటుపడాలి’.. అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed