- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వారికి జైలు జీవితం అలవాటే.. మరి మీకు’?
దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైలు జీవితం అలవాటేనని, గౌతమ్ సవాంగ్, నీలం సాహ్నీలే తమ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో కోర్టు తీర్పులు రావడం ఎన్నడూలేదని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు యెస్ అంటున్న అధికారులు ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి తయారు చేస్తున్న జీవోలపై నీలం సాహ్నీ గుడ్డిగా సంతకాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో కీలక పదవుల్లో ఉన్న కొందరు ఐఏఎస్ లు ఇప్పుడు కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతున్నారో తెలియదా? అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో సీబీఐ విచారణ వేయడం అంటే పోలీసుల ప్రతిష్ఠ దిగజారినట్టు కాదా? నిలదీశారు.