- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ భరతం పట్టాలి.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: యువత బీజేపీ నాయకుల భరతం పట్టాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకోలేరని, తెలంగాణ బీజేపీ నేతలకు నెత్తురు లేదని దుయ్యబట్టారు. ఉత్తర బీజేపీ నేతలకు బానిసలుగా.. గుజరాత్ నేతలకు గులాములుగా మారారని మండిపడ్డారు. కేసీఆర్‌పై మాట్లాడే స్థాయి తరుణ్ చుంగ్ ది కాదన్నారు. తరుణ్ చుంగ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు. పంజాబ్ లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పగలవా? అని డిమాండ్ చేశారు. మీడియాలో ప్లేస్ కోసమే రేవంత్ పాకులాట అని మండిపడ్డారు. రేవంత్ మాటలను తెలంగాణ సమాజం పట్టించుకోవడం లేదన్నారు.
వానకాలం ధాన్యం కొనుగోళ్లపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని పార్లమెంట్ లో తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపడితే ఎంపీగా రేవంత్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఎక్కడ తిరిగినా అడ్డుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. విష ప్రచారంపై యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల పేరుతో బండి సంజయ్ చిల్లర డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు దమ్ముంటే కేంద్రంలో ఖాళీగా ఉన్న ఎనిమిది లక్షలపైగా ఉద్యోగాల భర్తీపై కేంద్రంతో కొట్లాడాలని సూచించారు.