- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలయ్య తనయుడి ఎంట్రీ ఫిక్స్.. ప్రభాస్‌తో తొలి సినిమా..??
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ తన తయుడు మోక్షజ్ఞని కూడా హీరోగా చేయాలని తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో బాలయ్య చేయని ప్రయత్నం లేదు. అయితే తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బాలయ్య కెరీర్‌లో పెద్ద మలుపుగా చెప్పుకునే ‘ఆదిత్య 369’ సీక్వెల్ అభిమానులకు చిరకాల కొరిక. ఎట్టకేలకు ఈ సినిమా సీక్వెల్ కథను ‘ఆదిత్య 369‘ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఈ సినిమా సీక్వెల్ కథను సిద్ధం చేశారట. ఈ సీక్వెల్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించి ఈ కథ నడవనుందట.
ఈ సినిమాను కూడా సింగీతం శ్రీనివాస్ డైరెక్ట్ చేయొచ్చని, లేకుంటే ఆయన పర్యవేక్షణలో సినిమా తెరకెక్కవచ్చని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ ‘ప్రాజెక్ట్ K’కు దర్శక పర్యవేక్షకునిగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ‘ప్రాజెక్ట్ K’ టైమ్ ట్రావెల్ బేస్‌డ్ సినిమా అని టాక్ నడుస్తోంది. దీంతో ‘ప్రాజెక్ట్ K’ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడా అని అభిమానుల్లో సందేహాలు వస్తున్నాయి. తొలి సినిమాలోనే ప్రభాస్‌తో నటించే ఛాన్స్ కొట్టేశాడని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.