బాలయ్య ఎమోషనల్.. ఒక్క అభిమాని దూరమైనా భరించలేను

by Anukaran |   ( Updated:2021-06-07 07:19:55.0  )
బాలయ్య ఎమోషనల్.. ఒక్క అభిమాని దూరమైనా భరించలేను
X

దిశ, వెబ్‌డెస్క్: అభిమానులు బాలయ్యను ఎంతగా అభిమానిస్తారో.. బాలయ్య కూడా అభిమానులను అంతగా ఇష్టపడతారు. తనకు దగ్గరైన అభిమానులకు బాలయ్య ఎప్పుడూ కాల్ చేసి ఆరోగ్య పరిస్థితితో పాటు కుటుంబ విషయాల గురించి తెలుసుకుంటారనే విషయం మనకు తెలిసిందే. అభిమానుల పెళ్లిళ్లకు కూడా బాలయ్య హాజరై ఆశీర్వదించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక సెలబ్రెటీలా కాకుండా సాధారణ వ్యక్తిలా అభిమానులతో వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా తన ఫ్యాన్స్‌ని ఉద్దేశించి నటసింహం నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో భావోద్వేగంతో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

ఈ నెల 10న బాలయ్య తన 61వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. బర్త్ డే రోజు చాలామంది అభిమానులు బాలయ్యను స్వయంగా కలిసి విషెస్ తెలియజేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కరోనా ప్రభావం క్రమంలో తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని బాలయ్య సోషల్ మీడియా కోరారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా పేజీలో ఫ్యాన్స్‌కు ఒక సందేశం ఇచ్చారు.

”నా ప్రాణ సమానులైన అభిమానులకు.. ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టిన రోజునాడు..నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని.. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు ..నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానం ..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను ..మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు.. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు.. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక ..దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ..ఈ విపత్కాలంలో అసువులు బాసిననా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ .. మీ నందమూరి బాలకృష్ణ” అంటూ బాలయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

Next Story