వసుంధర అలా చేయమని ప్రామిస్ తీసుకుంది.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shyam |   ( Updated:2021-12-05 22:48:08.0  )
balayya
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో కలెక్షన్ల వరద పారిస్తున్నారు. అదే సమయంలో హోస్ట్‌గానూ ‘ఆహా’లో ‘అన్‌స్టాబబుల్‌’గా దూసుకెళుతున్నారు. బాలకృష్ణను నెవ్వర్ బిఫోర్ అనేలా ఈ టాక్ షోలో కనిపిస్తున్నారని అభిమానులు, ప్రేక్షకులు అంటున్నారు. ఈ షోకు స్టార్ నటీనటులు సైతం హాజరై బాలయ్యతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఎపిసోడ్‌కి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చారు.

ఈ సందర్భంగా బాలయ్య తన భార్య వసుంధరకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఎప్పుడైనా ఇతర హీరోల సినిమా చూసేందుకు ఇద్దరం కలిసి వెళుతున్నామంటే తన భార్య తనచేత ఒట్టు వేయించుకుంటుందని బాలయ్య చెప్పుకొచ్చారు. అయితే తన కుటుంబం గురించి అంతగా మాట్లాడని బాలయ్య తన భార్య ప్రస్తావన తీసుకురావడంతో ప్రేక్షకులు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. తీరా బాలయ్య చెప్పిన విషయం విని నవ్వుకున్నారు.

‘సాధారణంగా నేను సినిమాకు వెళ్లినప్పుడు సినిమా నచ్చకపోతే మధ్యలోనే వచ్చేస్తా. అందుకే నా భార్య వసుంధర సినిమాకి వెళుతుంటే నా చేత ఒట్టు వేయించుకుంటుంది. తనతో సినిమాకి వస్తే సినిమా బాగున్నాలేకున్నా మధ్యలో వెళ్లిపోనని ఒట్టు వేయాలి. అప్పుడే తను వస్తుంద’ని బాలయ్య చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story