- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలాపూర్ సీఐకు కరోనా పాజిటివ్
దిశ, హైదరాబాద్ :
కరోనా నేపథ్యంలో రాత్రిబవళ్లు విధులు నిర్వర్తించిన పోలీసులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు తెలుస్తోంది.దీంతో అతన్ని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.వివరాల్లోకి వెళితే..బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో డీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధీర్ కృష్ణ మూడ్రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాడు. అక్కడి సిబ్బంది ఫీవర్ ఆస్పత్రికి రిఫర్ చేసి, పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.అనంతరం ఆయన్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు బాలాపూర్ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి తెలిపారు.దీంతో అప్రమత్తమైన సిబ్బంది బాలాపూర్ పీఎస్ పరిధిలో పనిచేస్తున్న 30మంది పోలీసుల అధికారులు, సిబ్బంది నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో బాలాపూర్ వైద్య సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం.