పాన్ షాప్ నిర్వాహకులకు కౌన్సిలింగ్.. అలా చేస్తే సంవత్సరం పాటూ జైలే..

by Shyam |
పాన్ షాప్ నిర్వాహకులకు కౌన్సిలింగ్.. అలా చేస్తే సంవత్సరం పాటూ జైలే..
X

దిశ, జల్ పల్లి : పాన్ షాప్ లలో గంజాయి, గుట్కాను విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని బాలాపూర్ ఇన్ స్పెక్టర్ బి.భాస్కర్ హెచ్చరించారు. శనివారం ఆయన బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పాన్ షాప్ నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక నుంచి పాన్ షాప్ లలో గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గంజాయి విక్రయాల జోలికి పోవద్దని, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తే సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అవగాహన కల్పించారు.

Advertisement

Next Story

Most Viewed