ఒకేరోజు మూడు లక్షల విగ్రహాల నిమజ్జనం.. హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు

by Shyam |
Hyderabad CP Anjani Kumar
X

దిశ, జల్‌పల్లి: విశ్వ ఖ్యాతి గాంచిన బాలాపూర్ గణపతిని శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డిలు దర్శించుకున్నారు. అనంతరం గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందంతో కలిసి అతిథులను సన్మానించారు. అనంతరం లడ్డును ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా గతేడాది గణేష్ ఉత్సవాలు సరిగ్గా జరుపుకోలేక పోయామని గుర్తుచేశారు. ఈ ఏడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మూడు లక్షలకు పైగా గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారని తెలిపారు. 19వ తేదీ ఆదివారం జరుగనున్న గణేష్ నిమజ్జనోత్సవానికి పోలీసు, జీహెచ్‌ఎంసీ తరపున ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

నిమజ్జనం రోజున జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం బాలాపూర్ నుండి ట్యాంక్ బండ్ వరకు సుమారు 17 కిలోమీటర్ల వరకు రూట్‌మ్యాప్‌ను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బృందం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు డీఎస్ చౌహన్, షికా గోయల్, ఎల్బీ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్, డీసీపీ రాజేశ్వరి, జీహెచ్‌ఎంసీ సౌత్‌జోన్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, ఫలక్‌నుమా ఏసీపీ మజీద్, బాలాపూర్ ఇన్ స్పెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed